![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చాక కథ మారిపోయింది. హౌస్ లోని పాత కంటెస్టెంట్స్ అంతా డల్ ఆయిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో అయేషా గురించి తెలుసుకుందాం.
ఆయేషా కేరళలో జన్మిచింది. తనకి నటనపై ఆసక్తితో ఉండటంతో మొదటగా తనకొచ్చిన ఆఫర్ సీరియల్. దాంతో తను 'సత్య'అనే తమిళ్ సీరియల్ లో నటించింది. అది సూపర్ హిట్ అవ్వడంతో సత్య2 కూడా తీశారు మేకర్స్. అయితే ఆ తర్వాత అయేషాకి రెండుసార్లు నిశ్చితార్థం జరిగింది. కానీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. కొన్ని ప్రాజెక్ట్ లకు వారిద్దరు కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా తనకి బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆమె చెప్పింది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్మెంట్ లోనే అతనికి కూడా ఆమె గుడ్ బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. ఇక ఈ లవ్ మనకు వర్కవుట్ కాదని కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేయాలని తెలుగు బిగ్ బాస్ కి వచ్చినట్టుగా నాగార్జునతో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్పుకొచ్చింది.
ఆయేషా హీరోయిన్‌గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్ బాస్ లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్ గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ పై ఫైర్ అవ్వడం సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పింది. ఒకసారి హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ నే ఎదురించి వైరల్ అయింది. తెలుగులో 'ఊర్వశివో రాక్షసివో ' అనే సీరియల్ లో నిఖిల్ తో కలిసి నటించింది అయేషా. ఇంత ఫైర్ ఉన్న ఈ వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ ని మన తెలుగు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి మరి.
![]() |
![]() |